నటాషా స్టాంకోవిచ్‌తో హార్దిక్ పాండ్య విడాకులు

టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య , నటాషా స్టాంకోవిచ్‌ల వైవాహిక బంధానికి తెర

Image: facebook

తాము విడాకులు తీసుకోనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన హార్దిక్ పాండ్య, నటాషా.

కుమారుడు అగస్త్యను తీసుకొని ఇటీవల ముంబయి నుంచి సెర్బియాకు వెళ్లిన నటాషా

బుధవారం హార్దిక్, నటాషా ముంబాయి విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఫొటోలు , వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇంతలోనే తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించిన హార్దిక్, నటాషా

4 సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత నటాషా , నేను పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నామని తెలిపిన హార్దిక్

కుమారుడు అగస్త్య బాధ్యతను తల్లిదండ్రులుగా ఇద్దరం చూసుకుంటామని హార్దిక్, నటాషా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు

2019 డిసంబర్ 31న దుబాయ్‌లో పాండ్య .. సెర్బియా నటి నటాషా చేతికి ఉంగరం తొడిగి తన ప్రేమను వ్యక్తపరిచి ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు హార్దిక్

తర్వాత కుటుంబసభ్యుల సమక్షంలో నటాషాను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు హార్దిక్

2023 ఫిబ్రవరి 14న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ ప్యాలెస్‌లో హిందూ, క్రిస్ట్రియన్ పద్ధతుల్లో వివాహం చేసుకున్నారు.