సంతానాన్ని పెంచే గింజ పప్పులు ఇవే.
జీవనశైలి మార్పులతో రోజురోజుకు సంతానలేమి సమస్య పెరిగిపోతుంది.
సంతానలేని దంపతులను మానసిక ఒత్తిడి, కుంగుబాటు, ఆందోళనకు గురిచేస్తుంది.
వాల్ నట్స్, బాదం, అక్రోట్ల వంటి గింజ పప్పులు తీసుకోవడం వల్ల మగవారిలో వీర్యం నాణ్యత మెరుగుపడుతుంది.
ప్రతి రోజు రెండు గుప్పిళ్లు తింటే సంతాన సామర్థ్యం పెరగడానికి తోడ్పడుతుంది.
నట్స్‌లో ఉండే ఒమేగా-3 పాలీఅన్‌సాచ్యురేటెడ్ కొవ్వులు, పీచు పదార్థాలు, ఖనిజాలు ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.
నట్స్ తింటే లావు పెరుగుతారు అనుకోవడం పొరపాటు.. రోజుకు రెండు గుప్పిళ్లు నట్స్ తినేవారు సన్నబడతారు.
గింజపప్పుల్లో మోనోఅన్సాచ్యురేటెడ్ కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు, శరీరం తయారుచేసుకోలేని పోషకాలు ఉంటాయి.
నట్స్‌లో ఉప్పు, చక్కెర కలపకుండా పచ్చిగా లేదా వేయించిన గింజపప్పులు తీసుకోవడం మంచిది.