మాజీ ఎంపీ హర్షకుమార్ సీఎం జగన్పై మరోసారి విరుచుకుపడ్డారు. వైసీపీ పాలనలో దళితులు తీవ్ర నిర్లక్ష్యానికి గురైరయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ను గద్దె దించేందుకు దళితులంతా సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఫిబ్రవరి 8న రాజమహేంద్రవరం వేదికగా దళిత సింహగర్జన నిర్వహించనున్నట్లు తెలిపారు. వైసీపీ నేతలు సామాజిక సాధికార యాత్ర పేరులో దళితులను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీలపై దాడులు అధికమయ్యాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తాను అమలాపురం నుంచే లోక్సభకు పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
జగన్ను గద్దె దించేందుకు సిద్ధం
