కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ తీపికబురు చెప్పింది. వారి కరువు భత్యాన్ని 4 శాతం పెంచుతూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో వారికి ఇప్పటివరకు ఇస్తున్న 46 శాతం డీఏ 50 శాతానికి చేరింది. ఇది జనవరి 1, 2024 నుంచే అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తాజా నిర్ణయంతో దాదాపు కోటి మంది ఉద్యోగులు పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. కేంద్ర తీసుకున్న తాజా నిర్ణయంతో ఖజానాపై ఏటా దాదాపు రూ. 12,869 కోట్ల మేరకు అదనపు భారం పడనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి దీని ప్రభావం రూ. 15,014 కోట్లు అని తెలిపారు.