మంత్రి పెద్దిరెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి సంచనల వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు రాత్రి 11 గంటలకు పద్మావతి గెస్ట్‌హౌస్‌కు పెద్దారెడ్డి వచ్చి నా కాళ్లు పట్టుకున్నారని ఆరోపించారు. డీసీసీ పదవి ఇప్పించాలని ప్రాథేయపడ్డారని పేర్కొన్నారు. తాగి వచ్చాడని నేను అనుకున్నానేమోనని మరుసటి రోజు ఉదయం కూడా మళ్లీ వచ్చి నా కాళ్లు పట్టుకున్నాడు. డీసీసీ పదవికి సహకరించలేదని అప్పటి నుంచి తనపై కసి పెంచుకున్నారని అన్నారు. కుటుంబ పాలన నుంచి ఇసుక మాఫియా వరకు అన్నీ చేశారని మండిపడ్డారు. ఈ విషయంపై కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో పెద్దిరెడ్డి పెద్ద ఎత్తున డబ్బు పంపిణీకి సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు.