తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ , బీజేపీలకు ప్రజా సమస్యలు పట్టవని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి ఓట్లు, సీట్లు కావాలని ఎద్దేవా చేశారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోందని పేర్కొన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్కు 12 లోక్సభ సీట్లు రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న కేసీఆర్.. రాబోయే సంకీర్ణ ప్రభుత్వంలో నామా నాగేశ్వరరావు కేంద్రమంత్రి అవుతారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని విరుచుకుపడ్డారు. కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామన్నారు. ఇప్పుడు అడిగితే ఎదురు దాడికి దిగుతున్నారని మండిపడ్డారు.