రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్. తమ కూటమికి 130కి పైగా అసెంబ్లీ సీట్లు , 20 నుంచి 23 ఎంపీ స్థానాలు వస్తాయన్నారు. ఎంపీగా తాను 2 లక్షల నుంచి 3 లక్షల మెజార్టీతో విజయం సాధిస్తా అని ధిమా వ్యక్తం చేశారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి వైసీపీ నుంచి పోటీ చేస్తున్న కిలారి రోశయ్య ఇప్పటికీ మూడు రాజధానులంటూ ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్నారని విమర్శించారు. ఎంపీ గల్లా జయదేవ్‌ను చాలా బాధ పెట్టారు. దీనికి తగిన మూల్యం తప్పదని చెప్పారు.