ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్‌పోల్స్ సర్వేలు కొన్ని కూటమికి అనుకూలంగా, మరికొన్ని అధికార వైసీపీకి పట్టం కట్టాయి. దీంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న దానిపై స్పష్టత లేకుండా పోయింది. ఈ క్రమంలో తమదే విజయమన్నధీమాలో పార్టీలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే కూటమి ఏపీలో ఘనవిజయం సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ కూటమి 160 సీట్లను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో అభివృద్ధి, సంక్షేమ పాలన రాబోతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
గతంలో క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. విజయవాడ లోక్‌సభకు పోటీ చేసి ఓటమి చెందిన తర్వాత రాజకీయలకు దూరంగా ఉన్నా టీడీపీకి నైతికంగా మద్దతు ఇస్తున్నారు.