ఏపీలో వాలంటీర్ల నియాకంలో మార్పులు.. చంద్రబాబు కీలకనిర్ణయం

chandrababu pawan kalyan

ఆంధ్రప్రదేశ్‌లో కొలువు తీరుతున్న చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్ధం అవుతోంది. గత జగన్ పాలనతో తీసుకువచ్చిన వాలంటీర్ల వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. ఎన్నికల సమయంలోనే వివాదాస్పదంగా మారిన ఈ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు భారీగానే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని ఎన్నికల సమయంలోనూ చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వాలంటీర్ల నియామకంతో పాటు వ్యవస్థ కొనసాగింపులో మార్పులు, చేర్పులు చేయనున్నారు. వాలంటీర్లకు ఇస్తున్న జీతం కూడా పెంచేందుకు నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.

వాలంటీర్ల జీతం పెంపు

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల జీతం పెంచుతామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. కనీసం వాలంటీర్ల జీతం రూ 10 వేలకు పెంచుతామని చెప్పారు. ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న కసరత్తు మేరకు ప్రతి గ్రామంలో ఉండే వాలంటీర్ల సంఖ్యను కూడా తగ్గించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు వాలంటీర్లకు ఇస్తున్న 5000 జీతాన్ని 10 వేల రూపాయాలకు పెంచే దిశగా కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన కొత్త నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్దమవుతోంది. త్వరలోనే వాలంటీర్ల వ్యవస్థలో మార్పులకు సంబంధించిన పూర్తి విధి విధానాలను ఖరారు చేయనుంది.

వాలంటీర్ల నియామకం, అర్హత

అటు వాలంటీర్ల నియామకంలో డిగ్రీ అర్హత నిర్ణయించే అవకాశం ఉంది. వారి వయోపరిమితి కూడా నిర్ణయించనున్నారు. వాలంటీర్లు కేవలం గ్రామ పరిధిలోనే కాకుండా మండల పరిధిలో విధులకు హాజరు అయ్యేలా మార్పులు చేస్తున్నట్లు సమాచారం. వాలంటరీ సచివాలయ సిబ్బంది వ్యవస్థ గ్రామ సర్పంచుల ఆధీనంలో పూర్తి అధికారం ఉండేలా విధి విధానాలను రూపకల్పన చేసే అవకాశం ఉంది. ప్రతి గ్రామానికి కొంత మొత్తంలో సంక్షేమ నిధి కూడా ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటి వరకు ప్రతి నెలా ఇస్తున్న పెన్షన్ విధానంలోనూ మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇంటికి వెళ్లి అందించే పెన్షన్‌.. ఇక నుంచి నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేయాలన్న దానిపై కసరత్తు జరుగుతోంది.

పెన్షన్‌ల పంపిని విధానంలో మార్పు

అయితే ప్రస్తుతం అందిస్తున్న విధానాన్ని కొనసాగించాలా లేదా మార్పు చేయాలన్న దానిపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసిన తర్వాతే దానిని అమలు చేసే అవకాశం ఉంది. అటు సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటికి ప్రాతినిధ్యం వహించేలా కొత్త కార్యాచరణ సిద్ధం అవుతోంది. పాలనలో కీలకంగా మారుతున్న వాలంటీర్ వ్యవస్థపై పూర్తి స్థాయిలో సమీక్షించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని కొత్త ప్రభుత్వం భావిస్తుంది.

 

Share this post

submit to reddit
scroll to top
స్రవంతి చొక్కారపు సోకుల విందు.. ఫుల్ డోస్‌తో సెగలు పుట్టించేస్తుందిగా! స్టన్నింగ్ లుక్స్‌తో సెగలు పుట్టిస్తున్న శ్రద్ధా కపూర్ సోకుల విందుతో మైమరిపిస్తున్న శ్రీముఖి సొగసైన అందాలతో మైమరిపిస్తున్న మీనాక్షి చౌదరి సొగసైన అందాలతో మైమరిపిస్తున్న దేవర బ్యూటీ జాన్వీకపూర్