తెలంగాణలో పర్యటిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లో ఉన్న చంద్రబాబు నివాసానికి వెళ్లిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఆయనకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. తమ రాజకీయ గురువు చంద్రబాబును ఇద్దరు ఎమ్మెల్యేలు శాలువాతో సన్మానించారు.