సీఎం రేవంత్ రెడ్డితో గౌతమ్ అదానీ భేటీ.. స్కిల్‌ యూనివర్సిటీకి భారీ విరాళం.

Gautam Adani met with CM Revanth Reddy.. Huge donation to Skill University.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్ నుంచి భారీ విరాళం ప్రకటించింది. రూ. 100 కోట్ల చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి గౌతమ్ అదానీ అందజేశారు. ఈ వర్సటీకి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. యువతకు నైపుణ్యాలు నేర్పించేలా రంగారెడ్డి జిల్లాలోని ముచ్చర్లలోని బేగరికంచెలో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. నవంబరు 4వ తేది నుంచి స్కిల్ యూనివర్సిటీలో కోర్సులు ప్రారంభం కానున్నాయి.

Share this post

submit to reddit
scroll to top