మోసగాళ్ల మాటలు విని మోసపోవద్దు.. నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన

CM Revanth Reddy on KTR behaviour

నిరుద్యోగులకు మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడిపేందుకు కొన్ని పార్టీ కుట్రలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన పదేళ్లలో ఉద్యోగాల భర్తీని పట్టించుకోని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నేడు ఇష్టం వచ్చినట్లు ఆపార్టీ నేతలు మాట్లాడున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టామని అన్నారు. రాజేంద్రనగర్ పోలీస్ అకాడమీలో పోలీస్ డ్యూటీ మీట్ ముగింపు కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నిబంధనలు మార్చితే కోర్టులు కొట్టివేస్తాయి అని పేర్కొన్నారు. జీవో నెంబర్ 50 ప్రకారం ముందుకు వెళ్తే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు నష్టం జరిగేదన్నారు. గ్రూప్-1 మెయిన్స్‌లో 1:50కి కూడా రిజర్వేషన్లు పాటిస్తున్నామని తెలిపారు . తమ ప్రభుత్వం చేపట్టిన పరీక్షల నిర్వహణ విధానాన్ని కోర్టులు సమర్థించాయని గుర్తు చేశారు. విద్యార్థులంతా ఆందోళనలు విరమించి పరీక్షలకు సిద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు. మోసగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని నిరుద్యోగులను కొరారు.

Share this post

submit to reddit
scroll to top