Naga Chaitanya : నా జీవితంలో ఏర్పడిన వెలితి శోభితాతో పూర్తి: నాగచైతన్య

Naga chaitanya sobhita

నటుడు అక్కినేని నాగచైతన్య తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటి శోభితా ధూళిపాళ్లతో డిసెంబర్ 4న హైదరాబాద్‌లో జరగనుందని తెలిపారు. తమ పెళ్లి వేడుకలు చాలా సింపుల్‌గా, సంప్రదాయబద్ధంగా జరగనుందని చెప్పారు. వివాహానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియోలోని తాతగారి విగ్రహం ఎదురుగా తమ పెళ్లిజరుగుతుందని వెల్లడించారు.శోభితాతో తన జీవితంలో సరికొత్త ఆధ్యాయాన్ని ఆరంభించేందుకు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నా. నా జీవితంలో ఏర్పడిన వెలితిని ఆమె పూర్తి చేస్తుందని నమ్ముతున్నానని పేర్కొన్నారు. తను నన్ను బాగా అర్థం చేసుకుందని తెలిపారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు మొత్తం 300 మందిని పిలవాలని అనుకుంటున్నామని చెప్పారు.

Share this post

submit to reddit
scroll to top