కడప కేంద్రం గా నడుస్తున్న Ktv ని భారీ మొత్తానికి సగం వాటా ఒక రాజకీయ నేతకు ఇచ్చేసినట్లు విశ్వసనీయ సమాచారం.. ఉగాది పర్వదినాన ఈ డిల్ జరినట్లు తెలుస్తోంది. ఊహించిన మొత్తం ఆఫర్ చేయడం తో Ktv లో సగం వాటా ఇవ్వడానికి అంగీకారం తెలిపినట్లు మీడియా వర్గాలలో చర్చ నడుస్తోంది.ఈ మేరకు మొత్తం డబ్బులను యాజమాని ఏర్పాటు చేసిన విందు రోజున బదిలీ చేశారని చెబుతున్నారు. నెల్లూరు కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ కూడా 25% వాటా అడుగుతున్నట్లు కూడా అయితే డిల్ కుదరలేదని చెబుతున్నారు.. మెజారిటీ వాటా లను అమ్మడం ద్వారా భారీగా వచ్చిన డబ్బుతో Ktv ని మరింతగా విస్తరించాలనే ఆలోచనతో భాగస్వామ్యులు ఉన్నట్లు తెలుస్తోంది..
Ktv కి అంతా తానై నడిపిన , Ktv వ్యవస్థాపకుడు భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి త్వరలో మంచి రేటింగ్ ఉన్న శాటిలైట్ ఛానల్ లో చేరడానికి తెలంగాణ కు చెందిన ప్రముఖ మాజీ CEO ద్వారా లాబియింగ్ చేస్తున్నారు. దాదాపు Ktv ఛానల్ ని తన వాటా ప్రతినిధి గా ప్రస్తుతం Ktv లో పని చేస్తున్న ఒకరిని పెట్టుకొని తనకు Ktv కి సంబంధం లేనట్లు శాటిలైట్ ఛానల్ లో పనిచేసేలా ప్రణాళికలు చేసుకున్నారని చెబుతున్నారు. ఈ మద్య జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో శాటిలైట్ వైపు మొగ్గుచూపారని చెబుతున్నారు. Ktv లో 50% వాటా ను ఊహించని రేటు కు అమ్మడం తో పాటు శాటిలైట్ కు మళ్లీ రావాలను కోవడం వెనుక దీర్ఘ కాలిక ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు.
భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి తన మార్క్ తో ఇన్నాళ్లు నడిచిన Ktv లో ఎడిటోరియల్ మొత్తం మారేఅవకాశాలు ఉన్నాయంటున్నారు. పులివెందుల నియోజకవర్గానికి చెందిన మాజీ ఈనాడు ప్రతినిధి ని ఎడిటోరియల్ చైర్మన్ గా కొత్త యాజమాన్యం పెడుతున్నట్లు కొత్త ముఖాలతో స్కీన్ మరింత అందంగా చేయడానికి యాంకర్స్ ను కూడా తీసుకునేందుకు ప్రణాళికలు శరవేగంగా జరుగుతున్నాయి. కడప కేంద్రంగా చాలా మంది ఛానల్ నిర్వహణ కు శ్రీకారం చుట్టిన Ktv కొంత తన మార్క్ చూపించింది.. మరి నూతన యాజమాన్య భాగస్వామ్యం తో Ktv లో ఎలాంటి మార్పులు చొటుచేసుకుంటాయోననే టాక్ నడుస్తోంది