టీడీపీ పని అయిపోయిందన్న వాళ్ల పరిస్థితి ఈ రోజు ఇదే!

CM Chandrababu Speech at Kadapa Mahanadu

కడపలో టీడీపీ మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. కడప గడ్డపై జరుగుతున్న తొలి మహానాడు చరిత్ర సృష్టించబోతుందని అన్నారు. ఉమ్మడి కడప జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలను గాను 7 స్థానాల్లో విజయం సాధించామని గుర్తు చేశారు. పార్టీ ఇంతటి అద్భుత విజయాన్ని సొంతం చేసుకోవడానికి కారణం పసుపు సైనికులే అని స్పష్టం చేశారు.

టీడీపీ పని అయిపోయిందంటూ మాట్లాడారు. ఇప్పుడు వాళ్ల పనే అయిపోయిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ 43 సంవత్సరాల తెలుగుదేశం ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కోని సంక్షోభాలను చూసాం.. ఎదుర్కున్నామని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో విధ్వంస పాలన, హత్యా రాజకీయాలు , కక్షసాధింపులకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాక్షస పాలనను ప్రశ్నించిన టీడీపీ నేతలను, కార్యకర్తల ప్రాణాలు తీశారు. అక్రమ కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేశారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా జెండా దించకుండా పోరాటం చేశారని అభినందించారు. మన కార్యకర్త, పసుపు సింహం చంద్రయ్య పీక కోస్తుంటే జై తెలుగుదేశం అని ప్రాణాలు వదిలాడని పేర్కొన్నారు. ఆయనే మనందరికి స్ఫూర్తి అన్నారు.

అధికారంలో ఉన్నా , ప్రతిపక్షంలో ఉన్నా విలువలతో కూడిన రాజకీయం చేసిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు అన్నారు. ప్రతిపక్షంలో అవినీతిపై పోరాటం చేశాం. అధికారంలో ఉంటే అవినీతి రహిత పాలన అందిస్తున్నాం అని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీలో చూసినా టీడీపీ వర్సిటీలో చదివిన విద్యార్థులే . తెలుగుదేశం పార్టీ చరిత్ర చింపేస్తే చిరిగేది కాదు… చేరిపేస్తే చెరిగేది కాదు అన్నారు.

తెలుగుదేశం అంటే ఒక బ్రాండ్ అని సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా నడవాలి.. కలిసి గెలవాలి. అభివృద్ధి , సంక్షేమం, సంస్కరణలు ప్రతిదానికి టీడీపీనే ట్రెండ్ సెట్టర్ అని కొనియాడారు. బడుగు , బలహీన వర్గాలకు రాజకీయాల్లో తగిన ప్రాధాన్యత ఇచ్చి వారి అభివృద్ధికి తోడ్పడిన పార్టీ టీడీపీయే అని అన్నారు. అడిగే పరిస్థితి నుంచి శాసించే స్థాయికి బీసీలను తీర్చిదిద్దిందని పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ కింద మూడు విడతల్లో రూ. 20వేలు ఇస్తామని చెప్పారు. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని ప్రకటించారు.

Share this post

submit to reddit
scroll to top
స్రవంతి చొక్కారపు సోకుల విందు.. ఫుల్ డోస్‌తో సెగలు పుట్టించేస్తుందిగా! స్టన్నింగ్ లుక్స్‌తో సెగలు పుట్టిస్తున్న శ్రద్ధా కపూర్ సోకుల విందుతో మైమరిపిస్తున్న శ్రీముఖి సొగసైన అందాలతో మైమరిపిస్తున్న మీనాక్షి చౌదరి సొగసైన అందాలతో మైమరిపిస్తున్న దేవర బ్యూటీ జాన్వీకపూర్