ప్రసిద్ధ నటుడు షాయాజీ షిండే తాజాగా మహారాష్ట్రలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో చేరారు. ముంబాయిలో నిర్వహించిన కార్యక్రమంలో ఎన్సీపీ చీఫ్ , మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. మరి కొన్ని నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల జరగనున్నాయి. షాయాజీ షిండే ఇప్పటికే సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఇప్పుడు ఈ రాజకీయ పాత్ర ద్వారా ప్రజలకు మరింత పనిచేయాలని ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
ఎన్‌సీపీ తరపున ఆయన ఎన్నికల ప్రచారంలో ప్రముఖంగా పాల్గొంటారు. అజిత్ పవార్ తాను పనిచేసే విధానం తమను ఆకర్షించిందని, సమాజంలో మరింత ప్రభావవంతంగా పనిచేయాలంటే రాజకీయ వ్యవస్థలో భాగం కావడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీలో షాయజీ షిండేకు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని ఈ సందర్భంగా అజిత్ పవార్ తెలిపారు.