Dharmavaram : ఏపీలో ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. అధికారమే లక్ష్యంగా అధికార, ప్రతిపక్షాలు జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. సినీ, సీరియల్ నటి, నటులు ఆయా పార్టీలకు మద్దతు తెలుపుతూ ప్రచారం చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ( NDA ), బీజేపీ నేత సత్యకుమార్‌కు మద్దతుగా సినీ నటి నమిత ( Actress Namitha ) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని చౌడేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ధర్మవరంలో రోడ్ షో చేపట్టారు. ఈ రోడ్ షోలో పెద్ద ఎత్తున బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలతో పాటు అభిమానులు తరలివచ్చారు. కేంద్రంలో, ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తేనే ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతాయని నమిత పేర్కొన్నారు.ఏపీలో కబ్జాలు, ఆక్రమణలు, అవినీతి పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమికి ఓటు వేసి గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పిలుపు నిచ్చారు.
ధర్మవరంలో నమిత రోడ్ షో.. సత్యకుమార్‌కు మద్దతుగా ప్రచారం.
