తిరుమల లడ్డూ నాణ్యత వివాదంపై దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా నటి ప్రణీత స్పందించారు. తిరుమల లడ్డూపై వస్తోన్న వార్తలు భక్తులు ఊహించలేనివిగా ఉన్నాయన్నారు. శ్రీవారి ప్రసాదంగా భావించే లడ్డూ తయారీలో జంతు కొవ్వు వినియోగించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి వార్తలు శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తులు కలలో కూడా ఊహించినది అని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ప్రణీత చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. లడ్డూ వివాదంపై మొదటిగా స్పందించినందుకు ఆమెను నెటిజన్లు అభినందిస్తున్నారు.