వైసీపీకి షాక్ మీద షాక్ తగులుతోంది. వచ్చే ఎన్నికల్లో మరోసారి టికెట్ దక్కని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామా బాట పడుతున్నారు. అటు ఇటీవల పార్టీలో చేరిన వారు సైతం గుడ్ బై చెప్పేస్తున్నారు. తాజాగా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. త్వరలోనే తన తదుపరి కార్యాచరణ ప్రటిస్తానని తెలిపారు. పార్టీలో చేరి పట్టుమని 10 రోజులు కూడా కాకుండా పార్టీని వీడటంతో అధికార పార్టీ నేతలు, కార్యకర్తల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.
వైసీపీకి మరో షార్.. అంబటి రాయుడు గుడ్ బై
