ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం.. 11 సీట్లకే పరిమితం

Jagan's heavy defeat in AP assembly elections

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. 175 అసెంబ్లీ సీట్లకు గాను కూటమి 164 సీట్లతో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది. ఎన్డీఏ కూటమిలో పార్టీల వారిగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ 144 స్థానాల్లో పోటీ చేయగా 135 స్థానాలను కైవసం చేసుకుంది. జనసేన 21కి 21 స్థానాలను సొంతం చేసుకుంది. పోటీ చేసిన అన్ని చోట్ల 100 శాతం విజయాన్ని సాధించింది. బీజేపీ మొత్తం 10 చోట్ల పోటీ చేయగా 8 సీట్లలో గెలుపొందింది. తొలు 10 సీట్లకే పరిమితం అవుతుందని అందరూ భావించారు. కానీ ప్రకాశం జిల్లా దర్శి స్థానం ఫలితంపై చివరి వరకూ ఉత్కంఠ కొనసాగింది. తొలి రౌండ్‌ నుంచి అధిక్యంలో కొనసాగిన టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి.. చివరి రౌండ్ వచ్చే సరికి తారుమారైంది. వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి 2,597 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో వైసీపీ సంఖ్య 10 నుంచి 11కి చేరింది. ఏపీ చరిత్రలోనే ఇంత ఘోరంగా ఒక రాజకీయ పార్టీ ఓటమి చెందడం ఇదే తొలిసారి.

 

Share this post

submit to reddit
scroll to top
స్రవంతి చొక్కారపు సోకుల విందు.. ఫుల్ డోస్‌తో సెగలు పుట్టించేస్తుందిగా! స్టన్నింగ్ లుక్స్‌తో సెగలు పుట్టిస్తున్న శ్రద్ధా కపూర్ సోకుల విందుతో మైమరిపిస్తున్న శ్రీముఖి సొగసైన అందాలతో మైమరిపిస్తున్న దేవర బ్యూటీ జాన్వీకపూర్ సొగసులతో సెగలు పుట్టిస్తున్న సంయుక్త..