ఏపీ సీఎం జగన్ ఇవాళ పల్నాడు జిల్లా క్రోసూరులో జగన్నన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం ప్రసగించారు. కాగా సీఎం జగన్ మాట్లాడుతూ..బీజేపీ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే నిన్న విశాఖపట్నంలో బీజేపీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ భారీ బహిరంగ సభకు ముఖ్య అతిధిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. కాగా అమిత్ షా మాట్లాడుతూ..ఏపీ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. అయితే వీటిని సీఎం జగన్ తిప్పికొట్టారు. క్రోసూరులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ దీనిపై మాట్లాడారు. ఏపీ సీఎం జగన్‌కు కేంద్ర ప్రభుత్వ అండ లేకపోయినా ఏం పర్వాలేదన్నారు. ఈ జగన్ ప్రజలనే నమ్ముకున్నాడని సీఎం తెలిపారు. ఆ దేవుడి దయ ఏపీ ప్రజల ఆశీర్వాదం ఉంటే చాలన్నారు. కాగా ఈ కురుక్షేత్ర సంగ్రామంలో మా దైర్యం మీరే అని సీఎం అన్నారు. ప్రతి ఒక్కరికి మంచి చేస్తే ప్రజలే నన్ను ఆదరిస్తారని సీఎం జగన్ స్పష్టం చేశారు.