ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ

ap deputy cm Pawan Kalyan met Union Home Minister Amit Shah in Delhi.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. బుధవారం సాయంత్రం ఏపీ క్యాబినెట్ సమావేశం అనంతరం ఆయన ఢిల్లీ వెళ్లారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా అమిత్ షా ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమిత్ షాతో పవన్ తొలిసారి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు మధ్య రాష్ట్రంలో పరిస్థితులపై కీలకంగా చర్చించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను వీలైనంత త్వరగా విడుదల చేయాలని అమిత్ షాను పవన్ కోరారు. సహకార శాఖ నుంచి నిధుల కేటాయింపుపై కూడా చర్చించినట్లు సమాచారం.

 

Share this post

submit to reddit
scroll to top
స్రవంతి చొక్కారపు సోకుల విందు.. ఫుల్ డోస్‌తో సెగలు పుట్టించేస్తుందిగా! స్టన్నింగ్ లుక్స్‌తో సెగలు పుట్టిస్తున్న శ్రద్ధా కపూర్ సోకుల విందుతో మైమరిపిస్తున్న శ్రీముఖి సొగసైన అందాలతో మైమరిపిస్తున్న మీనాక్షి చౌదరి సొగసైన అందాలతో మైమరిపిస్తున్న దేవర బ్యూటీ జాన్వీకపూర్