తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబంతో ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. ఏపీ కాంగ్రెస్ అధ్యురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా మర్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డిని కలిసినట్లు ఆమె తెలిపారు. ఇరువురి మధ్య తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ అంశాలపై కూడా చర్చించినట్లు పేర్కొన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బస్సు యాత్రపై కూడా ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డితో వైఎస్ షర్మిల భేటీ.. ఏపీ రాజకీయలపై చర్చ
