ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకోచ్చేందుకు అధిష్టానం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన గిడుగు రుద్రరాజను సీడబ్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. పీసీసీ అధ్యక్షురాలి పదవి ఇచ్చినందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి షర్మిల కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో పార్టీ పునరుద్ధరణకు తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.
ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల

AP PCC Chief YS Sharmila