జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. పార్టీలో చేరికపై ఆయనతో చర్చించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే ఒంగోలులో కార్యక్రమం ఏర్పాటు చేసి పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు పనిచేస్తానని అందరినీ కలుపుకొని ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ అభివృద్ధికి కృషిచేస్తానని చెప్పారు. జగన్ మోహన్ రెడ్డిని బ్లాక్‌మెయిల్ చేసినట్టు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా వైసీపీని వీడలేదన్నారు. జగన్‌ను నమ్మి ఆస్తులు పోగొట్టుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. నాతో పవన్‌కు పరిచయం లేకపోయినా నా గురించి మంచిగా మాట్లాడారని పేర్కొన్నారు. జనసేనలో చేరుతున్నా.. నాకు పదవులు ముఖ్యం కాద.. గౌరవం కావాలని తెలిపారు.
Balineni: పవన్ ఆదేశాల మేరకు పనిచేస్తా: బాలినేని శ్రీనివాస్‌రెడ్డి
