సీఎం రేవంత్‌ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ భేటీ

BRS MLA Prakash Goud met CM Revanth Reddy

లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నారు. కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో వారంతా త్వరలోనే కారు దిగేస్తున్నారంటూ జోరు ప్రచారం జరుగుతోంది. తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ భేటీ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన పార్టీ మారుతున్నారంటూ ఊహాగానాలకు తెరతీసింది. అయితే పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. సీఎంను మర్యాదపూర్వకంగానే కలిసినట్లు తెలిపారు. గతంలో రేవంత్ రెడ్డితో కలిసి టీడీపీలో పనిచేసిన విషయాన్ని గుర్తుచేశారు.

తన నియోజకవర్గంతో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. శంషాబాద్ మండలం కొత్వల్గుడా, బహదూర్ గూడా, ఘన్సిమియా గూడా గ్రామాల పరిధిలో భూ సంబంధ సమస్యలు పరిష్కారం చూపాలని అలాగే నియోజకవర్గం అభివృద్ధికి ప్రతేక నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు.దీనికి సీఎం గారు సానుకూలంగా స్పందించారాని తెలిపారు.ఇందులో ఎలాంటి రాజకీయ ఉదేశ్యం లేదని.. కాంగ్రెస్ పార్టీ లో చేరినట్లు వస్తున్నా వార్తలో వాస్తవం లేదని అన్నారు.

 

Share this post

submit to reddit
scroll to top
స్రవంతి చొక్కారపు సోకుల విందు.. ఫుల్ డోస్‌తో సెగలు పుట్టించేస్తుందిగా! స్టన్నింగ్ లుక్స్‌తో సెగలు పుట్టిస్తున్న శ్రద్ధా కపూర్ సోకుల విందుతో మైమరిపిస్తున్న శ్రీముఖి సొగసైన అందాలతో మైమరిపిస్తున్న మీనాక్షి చౌదరి సొగసైన అందాలతో మైమరిపిస్తున్న దేవర బ్యూటీ జాన్వీకపూర్