టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా, కనిగిరిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహా రెడ్డి నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్‌ను సందర్శించారు. పేదలకు స్వయంగా భోజనాలు వడ్డించారు. క్యాంటీన్ ఏర్పాటు చేసి ఏడాది అయిన సందర్బంగా పైలాన్ ఆవిష్కరించారు. అన్న క్యాంటీన్ నిర్వహకులను అభినందించారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులతో ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా వైసీపీకి చెందిన పలువురు చంద్రబాబు సమక్షంలో చేరారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
అన్న క్యాంటీన్‌లో భోజనాలు వడ్డించిన చంద్రబాబు
