చంద్రబాబు దగ్గర మెప్పు కోసం జగన్‌పై బాలనేని ఆరోపణలు

Chevireddy says Balaneni is making allegations against Jagan

గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలపై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతుంది. ఈ నేపథ్యంలోనే నాడు వైసీపీ సర్కార్ కేబినెట్‌లో విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైసీపీ నేత చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి స్పందించారు. బాలినేని అబద్ధాలు కూడా బాగా గొప్పగా చెబుతున్నారని మండిపడ్డారు. విద్యుత్ చరిత్రలో చారిత్రక ఒప్పందం YS Jagan Mohan Reddy హయాంలో జరిగింది. గతంలో Nara Chandrababu Naidu హయాంలో కంటే తక్కువ ధరకే విద్యుత్‌ కొనుగోళ్లు జరిగింది వైయస్‌ జగన్‌ పాలనలోనే అని పేర్కొన్నారు. సెకీ నుండి లేఖ వచ్చినప్పుడు సంతకం పెట్టి ఇవ్వాలా ఏమీ తెలియదని బాలినేని మాట్లాడటం తన వ్యక్తిత్వాన్ని తాను దిగజార్చుకోవడమే అని మండిపడ్డారు. వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో బాలినేనికి ఉన్న స్వేచ్ఛ ఎవరికీ లేదు. ఇతర పార్టీనేతలతో విదేశాలకు వెళ్లేంత స్వేచ్ఛ ఇక్కడ ఉందన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాలినేని ఎంత గొప్పగా చూసుకుందో ఆయనకు తర్వాత అర్థం అవుతుంది. చంద్రబాబు దగ్గర మెప్పుకోసం వైఎస్‌ జగన్‌పై అసత్య ఆరోపణలు చేయడం తగదని చెవిరెడ్డి హితవు పలికారు.

Share this post

submit to reddit
scroll to top
స్రవంతి చొక్కారపు సోకుల విందు.. ఫుల్ డోస్‌తో సెగలు పుట్టించేస్తుందిగా! స్టన్నింగ్ లుక్స్‌తో సెగలు పుట్టిస్తున్న శ్రద్ధా కపూర్ సోకుల విందుతో మైమరిపిస్తున్న శ్రీముఖి సొగసైన అందాలతో మైమరిపిస్తున్న మీనాక్షి చౌదరి సొగసైన అందాలతో మైమరిపిస్తున్న దేవర బ్యూటీ జాన్వీకపూర్ సొగసులతో సెగలు పుట్టిస్తున్న సంయుక్త.. సీమ చింతకాయలతో చింతలేని ఆరోగ్యం!