సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నిఖిల్ టీడీపీలో చేరడం ప్రాధాన్యత ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల ప్రచారంలో పార్టీ తరుపున ప్రచారం చేయనున్నారు.
తెలుగుదేశం పార్టీలో చేరిన సినీ హీరో నిఖిల్!
