విద్యార్థులు, యువతలో నైతిక విలువలు పెంపొందించేందుకు కృషి చేయాలని ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావుకు సీఎం చంద్రబాబు సూచించారు. మహిళలను గౌరవించడం, పెద్దలు, తల్లితండ్రుల మాటలకు విలువ ఇవ్వడం వంటివి యువతకు నేర్పించాలన్నారు. సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ను చాగంటి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యువతలో నైతిక విలువలు పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో తమ ప్రవచనాలతో విద్యార్థుల్లో మంచిని పెంచే ప్రయత్నం చేయాలన్నారు. అనంతరం చాగంటి కోటేశ్వరావుని సీఎం గారు శాలువాతో సత్కరించి, వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందించారు.