నేరాల నియంత్రణకు డ్రోన్ల వినియోగం .. చంద్రబాబు కీలక ఆదేశాలు.

Chandrababu on multi-purpose drones

రాష్ట్రంలో నేరాల నియంత్రణకు డ్రోన్లను వినియోగించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం సచివాలయంలో బెంగళూరుకు చెందిన ఓ ప్రైవేట్‌ సంస్థ తాము నిర్మించిన మల్టీ పర్పస్‌ డ్రోన్‌ల ప్రదర్శనను సీఎం ఎదుట ప్రదర్శించింది.ట్రాఫిక్ రద్దీ ప్రాంతాల్లో ఎన్ని వాహనాలు ఉన్నాయి. అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. ఆయా రూట్లలోని లోపాలను బేరీజు వేసుకుని ఈ డ్రోన్లను రియల్ టైమ్ లో అంచనా వేస్తామని ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు. ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఈ డ్రోన్ల ద్వారా పబ్లిక్ అనౌన్స్‌మెంట్‌ను నియంత్రించవచ్చు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో డ్రోన్ల వినియోగం పెరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు లేని ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారానే మందులను ప్రజలకు చేరవేయాల్సి ఉంది. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో డ్రోన్ల వినియోగం పెంచి ఆయా ప్రాంతాల్లో పరిశుభ్రత పెంపునకు చర్యలు చేపట్టాలని, దోమల నివారణ, మందు స్ప్రేయర్లను పెద్దఎత్తున చేపట్టాలన్నారు. అడవుల్లో కార్చిచ్చు వంటి ప్రమాదాన్ని డ్రోన్ల ద్వారా గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. డ్రోన్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపై కూడా ప్రజల్లో అవగాహన పెంచాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో డ్రోన్ల వినియోగం విస్తృతంగా చేయాలని ఆదేశించారు.

 

Share this post

submit to reddit
scroll to top
స్రవంతి చొక్కారపు సోకుల విందు.. ఫుల్ డోస్‌తో సెగలు పుట్టించేస్తుందిగా! స్టన్నింగ్ లుక్స్‌తో సెగలు పుట్టిస్తున్న శ్రద్ధా కపూర్ సోకుల విందుతో మైమరిపిస్తున్న శ్రీముఖి సొగసైన అందాలతో మైమరిపిస్తున్న దేవర బ్యూటీ జాన్వీకపూర్ సొగసులతో సెగలు పుట్టిస్తున్న సంయుక్త..