వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు 175 గెలుపొందడమే లక్ష్యంగా సీఎం జగన్ ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు. ఎవరి అంచనాలకు అందని విధంగా కసరత్తు చేస్తున్నారు. చాలా చోట్ల ఇప్పటివరకు ఉన్న నియోజకవర్గ ఇన్‌ఛార్జీలను మార్చి కొత్తవారికి అవకాశం ఇస్తున్నారు. ఇప్పటికే ఆరు విడతల్లో 63 అసెంబ్లీ, 16 లోక్‌సభ సీట్లకు ఇన్‌ఛార్జీలను నియమించారు. తాజాగా ఏడో జాబితాను వైసీపీ అధిష్టానం విడుదల చేశారు. ఇద్దరి పేర్లతో కూడిని జాబితాను ప్రకటించింది. కందుకూరు ఇన్‌ఛార్జీగా ఉన్న మహీధర్ రెడ్డిని తొలగించి .. కటారి అరవిందా యాదవ్‌ను సమన్వయకర్తగా నియమించింది. పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్‌ను తప్పించి ఆ బాధ్యతలను యడం బాలాజీకి అప్పగించింది.
ఇన్‌ఛార్జీ బాధ్యతల నుంచి మహీధర్ రెడ్డి, ఆమంచిల తొలగింపు
