తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ఇచ్చిన మాట ప్రకారం ప్రకారం రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.ఆగస్టులోపు మొత్తం మూడు విడతల్లో రుణమాఫీ చేస్తామని తేల్చి చెప్పారు. ప్రజాభవన్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యరు. రైతు రుణమాఫీ నాజీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. గురువారం సాయంత్రం 4 గంటలకు రూ. లక్ష వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేస్తున్నామని చెప్పారు.ఈ నెలాఖరులోప రూ. 1.50 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు ఆగస్టులో రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని ఈ సమావేశంలో వివరించారు. రుణమాఫీ పేరుతో కేసీఆర్ లాగా మాయ మాటలు చెప్పి తప్పించుకునే ప్రభుత్వం తమది కాదని స్పష్టం చేశారు. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని ఇదే విషయాన్ని ప్రజలకు వివరించాలని ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.
ఏక కాలంలో రూ 2 లక్షల వరకు రైతు రుణమాఫీ: సీఎం రేవంత్ రెడ్డి
