విజయకాంత్ మరణానికి కారణం ఇదే..

death-behind-the-captain-vijayakanth.jpg

తమిళనాడు సూపర్ స్టార్ విజయకాంత్‌ చాలాకాలంగా డయాబెటీస్‌తో బాధ పడుతూ మరణించారు. ఆయన మరణానికి ఎన్నో శరీర రుగ్మతలు కారణాలుగా వైద్యులు చెప్పుతున్నారు. షుగర్ వ్యాధి కారణంగా ఇన్‌ఫెక్షన్లు ఏర్పడడంతో ఆయన కుడికాలి వేళ్లను మూడింటిని తొలగించారు. అనంతరం 2020లో కరోనా బారిన పడ్డారు. ఇక అప్పటినుండి ఆయనను అనారోగ్య సమస్యలు చుట్టుముడుతూనే ఉన్నాయి. 2021లో ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆయనను దుబాయికి తరలించి చికిత్స అందించారు. దీనితో కొద్దిగా కోలుకున్నా, మళ్లీ ఈ ఏడాది నవంబర్ 18న ఆసుపత్రిలో చేరి డిశ్చార్జి అయ్యారు. కానీ మరోసారి ఇప్పుడు కరోనా కాటు వేయడంతో ఆయన మృతి చెందారు.

Share this post

submit to reddit
scroll to top