గత ప్రభుత్వం తప్పిదాల వల్లే విజయవాడకు వరదలు అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమర్శించారు. వరద బాధితులను అదుకునేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. వరద ప్రాంతాల్లో పర్యటించాలనుకున్నా.. కానీ నా వల్ల సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలగకూడదని భావిస్తున్నా అని పేర్కొన్నారు. నా పర్యటన బాధితులకు సహాయ పడేలా ఉండాలే తప్ప అదనపు భారం కాకూదని అన్నారు. నేను రాలేదని నిందలు వేయాలని అంటారు తప్ప.. మరొకటి కాదని అని పవన్ అన్నారు. ప్రకృతి విపత్తు సమయంలో నిందలు కంటే ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావాలని కోరారు.
విపత్తు నిర్వహణ కమిషన్ కార్యాలయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిపై పవన్ కల్యాణ్ సమీక్షించారు. వరద బాధితులను ఆదుకునేందుకు తనవంతు సాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడును బుధవారం కలిసి చెక్కును అందజేయనున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.