ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు ఆరు గంటల పాటు విచారించిన అనంతరం హేమంత్ సోరెన్‌ను రాంచీలోని ఈడీ కార్యాలయానికి తరటించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. హేమంత్ ఈడీ అధికారుల అదుపులోనే ఉన్నట్లు రాజ్యసభ ఎంపీ మహువా మజీ తెలిపారు. హేమంత్ సోరెన్ రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త ముఖ్యమంత్రిగా ఆయనకు అత్యంత సన్నిహితుడుగా ఉన్న చంపై సోరెన్‌ను ఎన్నుకున్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సింగా గవర్నర్‌ను కోరారు.