ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే దిశగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష్యతోనే ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని మండిపడ్డారు. నా సొంత బిడ్డ జైల్లో ఉంటే కన్నతండ్రిగా నాకు బాధ ఉండదా? అని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ఈసమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో క్లిష్ట పరిస్థితులు ఏమీ లేవు. ఇంతకంటే ఇబ్బందుల్లో కూడా తెలంగాణ సాధించాం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై పట్టు సాధించలేకపోయిందని విమర్శించారు. శాంతి భద్రతలు అదుపు తప్పాయని పేర్కొన్నారు. పార్టీ వదిలి వెల్లే వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని .. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యేలు బాగా ఎదుగుతారని మార్గనిర్దేశం చేశారు.