ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నారు. ఎత్తులు పై ఎత్తులతో ప్రధాన పార్టీలో వ్యూహరచన చేస్తున్నాయి. కాపు సంక్షేమ సేన అధ్యక్షులు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురు చర్చించారు. కాపుల ఓట్లు చీలకుండా కీలక నిర్ణయాలు తీసుకుటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పవన్‌కు సూచించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న సామాజిక, రాజకీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని హరిరామజోగయ్య అభిలాషించారు.
పవన్ కల్యాణ్‌కు హరిరామ జోగయ్య కీలక సూచనలు
