తెలంగాణలో బీజేపీకి షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన జితేందర్ రెడ్డి

eX mp jithender reddy joined in congress party

తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన వేళ బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నేత, మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ కాంగ్రెస్ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. హస్తం గూటికి చేరిన వెంటనే ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం పదవి కట్టబెట్టింది. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుగా నియమిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్‌నగర్ ఎంపీ టికెట్ ఆశించిన ఆయనకు బీజేపీ అధిష్టానం అవకాశం కల్పించకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో గురువారం జితేందర్ రెడ్డిని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కలిసి పార్టీలోకి ఆహ్వానించారు.

 

Share this post

submit to reddit
scroll to top
స్రవంతి చొక్కారపు సోకుల విందు.. ఫుల్ డోస్‌తో సెగలు పుట్టించేస్తుందిగా! స్టన్నింగ్ లుక్స్‌తో సెగలు పుట్టిస్తున్న శ్రద్ధా కపూర్ సోకుల విందుతో మైమరిపిస్తున్న శ్రీముఖి సొగసైన అందాలతో మైమరిపిస్తున్న మీనాక్షి చౌదరి సొగసైన అందాలతో మైమరిపిస్తున్న దేవర బ్యూటీ జాన్వీకపూర్