ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ – జనసేన కూటమిదే అధికారమని సినీ నటుడు సుమన్ జోస్యం చెప్పారు. అయితే సీట్ల సర్దుబాటు సక్రమంగా జరగాల్సి ఉందన్నారు. తిరుపతి తాతయ్యగుంటలోని గంగమ్మ అమ్మవారిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజకీయాల్లో తనకు చంద్రబాబే గురువని పేర్కొన్నారు. త్వరలో రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. ఓటర్లు ప్రలోభాలకు గురికావద్దన్నారు. ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధి పాలనను అందించిన వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్నారు. తనకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తనకు లేదన్నారు.
ఏపీలో టీడీపీ-జనసేనదే అధికారం : సినీ నటుడు సుమన్
