మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేశారు. వైసీపీ పార్టీకి రాజీనామ చేసి తన అనుచరులతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. శుక్రవారం ఉదయం గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షపదవికి, ఆపార్టీకి రాజీనామా చేశారు. తాడికొండ అసెంబ్లీ టికెట్‌ను అశించిన ఆయనకు సీఎం జగన్ మొండిచెయ్యి చూపించారు. అక్కడ మాజీ మంత్రి మేకతోటి సుచరితకు అవకాశం ఇచ్చారు. దీంతో గత కొంతకాలంగా డొక్కా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. నాలుగేళ్ల తర్వాత తిరిగి తెలుగుదేశం పార్టీ గూటికి చేరారు.