తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాలాలు పొంగిపోర్లుతున్నాయి. అటు రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురస్తాయని వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
భారీ వర్షాలు కురుసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, ఆర్‌అండ్‌బీ, విద్యుత్ శాఖలతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.