అక్రమ నిర్మాణాలపై హైడ్రా స్పీడ్ పెంచింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి నోటీసులు అందించారు. హైదరాబాద్ మాదాపూర్‌లో అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో ఆయన నివాసముంటున్నారు. తిరుపతి రెడ్డి ఉంటున్న ఇల్లు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్లు హైడ్రా అధికారులు గుర్తించారు.దీంతో ఆయన ఉంటున్నా ఇంటికి నోటీసులు అంటించారు. మరో వైపు దర్గం చెరువును ఆనుకుని ఉన్న కావూరి హిల్స్, నెక్టర్స కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు నోటీసులు జారీ జచేశారు.నెల రోజుల లోపు అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని హైడ్రా తన నోటీసుల జారీలో పేర్కన్నారు.