తెలంగాణ: తనను మేడం అని పిలవొద్దు అంటూ మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీతక్క అని పిలవాలని అధికారులకు సూచించారు. మేడం అంటే దూరం పెట్టినట్టుగా భావిస్తానన్నారు. సీతక్క అంటేనే మీ అక్కలాగా, చెల్లెలిలాగా కలిసిపోతానని చెప్పారు. పదవులు శాశ్వతం కాదు. విలువలు, మంచి పనులే శాశ్వతమన్నారు. కాంగ్రెస్ పాలన అంటే గడీల పాలన కాదు, గల్లీ బిడ్డల పాలన అని సీతక్క పేర్కొన్నారు.
నన్ను సీతక్క అని పిలిస్తేనే నాకు ఇష్టం: మంత్రి సీతక్క
