ప్రజాశాంతి పార్టీ అధ్యక్షడు కేఏ పాల్ తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయం వద్ద హల్ చల్ చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ను కలిసేందుకు వచ్చిన ఆయనను అనుమతిలేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంత సేపు ఎదురుచూసిన పాల్ అక్కడ నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేద్దామని చెప్పేందుకు వచ్చానని పేర్కొన్నారు. రెండు రోజు విజయవాడలోనే ఉంటా.. కలిసేందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోతే జగన్ కూడా మాజీ సీఎం అవుతారని అన్నారు. మంచిగా ఉంటే దీవిస్తా.. లేదంటే శపిస్తానని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ 175 సీట్లు గెలుస్తారో.. 75 సీట్లు గెలుస్తారో, 25 సీట్లు గెలుస్తారో తనకు తెలియదంటూ పేర్కొన్నారు.
సీఎం జగన్‌ని శపిస్తా.. తాడేపల్లిలో కేఏ పాల్
