ఏపీలో మళ్లీ జగనే సీఎం.. చంద్రబాబుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

kcr comments on ys jagan

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఏపీలో జరగనున్న ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందన్న దానిపై తన అభిప్రాయాన్న వ్యక్తం చేశారు. మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారితీశాయి.

తనకు ఉన్న సమాచారం మేరకు వైఎస్‌ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారని జోస్యం చెప్పారు. అక్కడ ఎవరు గెలిచినా తమకు బాధలేదు. ఎవరి అదృష్టం బాగుంటే వారు గెలుస్తారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఓ రాజకీయ పార్టీ నేతగా ఏ ఒక్క పార్టీకి వత్తాసు పలకడం సరకాదని అన్నారు. భవిష్యత్తులో ఏపీలోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పుకొచ్చారు.

Share this post

submit to reddit
scroll to top