తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నేత మధ్య మాటల యుద్దం మరింత పెరగింది. తాజాగా మాజీ సీఎం కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు తర్వాత బీఆర్‌ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీలో ఎవరూ ఉండరని పేర్కొన్నారు. చేపలు , గొర్రెల పంపిణీ పేరిట రూ. వేల కోట్లు తిన్నారని ఆరోపించారు. ప్రపంచంలోనే వింత అని చెప్పిన మేడిగడ్డ మూడేళ్లలో కూలిపోయిందని విమర్శించారు. మరమ్మతులు చేసినా మేడిగడ్డకు గ్యారంటీలేదని ఎన్డీఎస్‌ఏ నివేదిక ఇచ్చిందని చెప్పారు. పంద్రాగస్టుకు రూ.2 లక్షల రుణమాపీ చేయబోతున్నామని మరోసారి స్పష్టం చేశారు.