మంత్రి కోమటిరెడ్డి ఆహంకారం తగ్గించుకో : కేటీఆర్

KTR On Revanth Reddy and komatireddy

మంత్రి కోమటిరెడ్టి వెంకట్ రెడ్డి ఆహంకారంతో వ్యవహరిస్తున్నారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కోమటిరెడ్డి ప్రజలు, ప్రజాప్రతినిధులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి పైన నోరు పారేసుకుంటున్నారని దుయ్యబట్టారు. మొన్నటికి మొన్న రైతుబంధు అడిగితే రైతులను చెప్పుతో కొట్టమని తన అహంకారాన్ని బయట పెట్టుకున్న మంత్రి కోమటిరెడ్డి, ఈరోజు జిల్లా జడ్పీ చైర్మన్ పై అదే నోటి దురుసు చూపించారన్నారని విమర్శించారు. ప్రజా పాలన అని ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులకు కూడా గౌరవం లేకుండా నియంతృత్వ ధోరణిలో పని చేస్తుందన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జెడ్పీ సమావేశంలో దుర్మార్గంగా వ్యవహరించారంటూ మండిపడ్డారు. జడ్పీ చైర్మన్ అయిన సందీప్ రెడ్డిపై అధికారం, అహంకారంతో కోమటిరెడ్డి జడ్పీ చైర్మన్ వ్యవహరించిన తీరు ప్రజలు గమనిస్తున్నారన్నారు. అహంకారంతో అడ్డగోలుగా జడ్పీ చైర్మన్ పై దుర్భాషలాడిన మంత్రి కోమటిరెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజా ప్రతినిధులపైన కాంగ్రెస్ పార్టీ అరాచకాలను అడ్డుకొని తీరుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ దురహంకారంతో వ్యవహరిస్తే ఊరుకునేది లేదని, బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకునికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డితో కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. పార్టీ అంతా సందీప్ రెడ్డికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీలో ఉన్న కిందిస్థాయి కార్యకర్త నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు ఎవరికి ఇబ్బంది ఎదురైనా 60 లక్షల మంది కార్యకర్తల బలగం ఉన్న బిఆర్ఎస్ పార్టీ కుటుంబం భరోసాగా నిలబడుతుందని తెలిపారు. కోమటిరెడ్డి అరాచకపు వ్యవహారంలో గట్టిగా నిలబడి, నిలదీసిన సందీప్ రెడ్డిని కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. కాంగ్రెస్ పార్టీ ఎంత దుర్మార్గ పూరిత వ్యవహారాలకు దిగినా, ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ అమలు అయ్యేదాకా ఇలాగే కొట్లాడుదామని సందీప్ రెడ్డితో కేటీఆర్ అన్నారు.

 

Share this post

submit to reddit
scroll to top
స్రవంతి చొక్కారపు సోకుల విందు.. ఫుల్ డోస్‌తో సెగలు పుట్టించేస్తుందిగా! స్టన్నింగ్ లుక్స్‌తో సెగలు పుట్టిస్తున్న శ్రద్ధా కపూర్ సోకుల విందుతో మైమరిపిస్తున్న శ్రీముఖి సొగసైన అందాలతో మైమరిపిస్తున్న దేవర బ్యూటీ జాన్వీకపూర్ సొగసులతో సెగలు పుట్టిస్తున్న సంయుక్త..