అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడుదాం రండి: రాహుల్ గాంధీ

Rahul Gandhi

కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో జరుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రజలంతా ఐక్యతతో పోడాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ సర్కార్ విద్వేషం, హింసను వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. పశ్చిమబెంగాల్‌లోని సిలీగుడీలో భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ విద్వేషాన్ని రూపుమాపేందుకు ముందుకు రావాలని బెంగాలీలకు పిలుపు నిచ్చారు. ఇప్పుడు స్పందించకుంటే ప్రజలు ఎప్పటికీ క్షమించరని పేర్కొన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలోనే కులగణనను చేపట్టనున్న నేపథ్యంలో దీనిపై రాహుల్ గాంధీ స్పందించారు. సమాజంలోని ప్రతి ఒక్కరికి సమానమైన భాగస్వామ్యం కల్పించేందుకు కుల గణన ఒక్కటే మార్గమని తెలిపారు. ముఖ్యమంత్రి రెడ్డికి, తెలంగాణ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

 

Share this post

submit to reddit
scroll to top
స్రవంతి చొక్కారపు సోకుల విందు.. ఫుల్ డోస్‌తో సెగలు పుట్టించేస్తుందిగా! స్టన్నింగ్ లుక్స్‌తో సెగలు పుట్టిస్తున్న శ్రద్ధా కపూర్ సోకుల విందుతో మైమరిపిస్తున్న శ్రీముఖి సొగసైన అందాలతో మైమరిపిస్తున్న మీనాక్షి చౌదరి సొగసైన అందాలతో మైమరిపిస్తున్న దేవర బ్యూటీ జాన్వీకపూర్