మాట తప్పిన జగన్‌ను సాగనంపుదాం: వైఎస్ షర్మిల

ys sharmila on jagan

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీపై విమర్శనాస్త్రాలు గుప్పించారు పీసీసీ చీఫ్ షర్మిల. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రత్యేక హోదా తీసుకోస్తానని చెప్పి దానిని తుంగలో తొక్కారని విమర్శించారు. వైసీపీకి అన్నితానై భుజాన వేసుకుని 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టానని గుర్తుచేశారు. కానీ కనీస కృతజ్ఞత లేకుండా తన వ్యక్తిగత జీవితంపై దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి బెదిరింపులకు భయపడేది లేదన్నారు.

తిరుపతిలో ఏర్పాటు వేసిన కాంగ్రెస్ నాయకుల, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. అధికార వైసీపీ, టీడీపీ, జనసేనలు బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ అంటేనే బాబు, జగన్, పవన్ అని మండిపడ్డారు. జగన్ పాలనలో ఏపీ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హంద్రీనీవా ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేశారు. మిగిలిన 10 శాతం పనులు కూడా పూర్తి చేయడానికి చంద్రబాబు, జగనన్నకు సాధ్యం కాలేదని దుయ్యబట్టారు. గాలేరు-నగిరి ప్రాజెక్టులో మిగిలిన 50 శాతం పనులు జగన్ పూర్తి చేయలేకపోయారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా జగన్ మార్చారు. రూ 8 లక్షల కోట్ల అప్పు చేసిన జగన్ దానిలో రూ 50 వేల కోట్లు ఖర్చు పెట్టి ఉంటే పోలవరం పూర్తయ్యేది . కానీ ముఖ్యమంత్రి చేతగాని తనం వల్ల రాష్ట్రానికి నష్టం చేకూరుతుందన్నారు.

 

Share this post

submit to reddit
scroll to top
స్రవంతి చొక్కారపు సోకుల విందు.. ఫుల్ డోస్‌తో సెగలు పుట్టించేస్తుందిగా! స్టన్నింగ్ లుక్స్‌తో సెగలు పుట్టిస్తున్న శ్రద్ధా కపూర్ సోకుల విందుతో మైమరిపిస్తున్న శ్రీముఖి సొగసైన అందాలతో మైమరిపిస్తున్న మీనాక్షి చౌదరి సొగసైన అందాలతో మైమరిపిస్తున్న దేవర బ్యూటీ జాన్వీకపూర్